ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘ నాయకులు బుధవారం నాడు సిద్ధ సుదీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమితులైన సిద్ధ సుధీర్ కు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పులికొండ శ్రీనివాసరావు, అమరా శ్రీరామమూర్తి, బ్రహ్మేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.