కందుకూరు పట్టణంలో రేపు వైభవంగా జరగాల్సిన గ్రామదేవత అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. వందల ఏళ్ళ నాటి దెబ్బతిన్న అమ్మవారి మూల విరాట్టునే నూతన ఆలయంలో పునః ప్రతిష్ట చేయాలని కొందరు హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను బుధవారం మధ్యాహ్నం సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం తిరస్కరించింది. దాంతో గురువారం నూతన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.