ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నాడు ఏఎన్ఎం, ఆశ వర్కర్లుతో వైద్య అధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆశ వర్కర్లను కోరారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి అవగాహన కల్పించాలని కోరారు.