ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుప్రమాదంలో 5గురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 01:28 PM

తిరుపతి, నగరి మండలం ధర్మాపురం వద్ద ఓ లారీ బీభత్సంతో ఐదుగురి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి వ్యాను, కారు, బైకుతో పాటు జాతీయ రహదారిపై మార్కింగ్ వేస్తున్న నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికిక్కడే దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa