అల్పపీడన ప్రభావంతో ఏపీ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, రుతుపవనాల ప్రభావంతో ఈ నెలంతా వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.