ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15-23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో కాటేజీ దాతల సిఫార్సుపై ఇతరులకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ వెల్లడించింది. కేవలం కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని తెలిపింది. టీటీడీ వెబ్ సైట్ లో గదులు రిజర్వ్ చేసుకోవాలని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa