జీ20 సదస్సును చెడగొట్టడంలో పాల్గొనడం మానుకోవాలంటూ చైనాకు అమెరికా సూచించింది. తాజాగా దానిపై చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా, పశ్చిమ దేశాలు తమ సొంత అజెండాలను ముందుకు నెడుతూ జీ20ని విడగొట్టాలని చూస్తోందని ఆరోపించింది. పశ్చిమ దేశాలు తమ అజెండాలతను బలవంతంగా రుద్దుతూ జీ20ని క్యాస్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది.