వైసీపీ చేసిన పనులకు ఎవరూ భయపడేవాళ్లు లేరని జనసేనాని పవన్‌కల్యాణ్ అన్నారు. చట్టాలు సరిగా పనిచేస్తే.. బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. ‘‘వారాహియాత్ర సమయంలో వైసీపీ నేతలు కోనసీమ జిల్లాలో 2 వేలమంది నేరగాళ్లను దింపారు. కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని పథకం పన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నారు. కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో వెనక్కితగ్గారు’’ అని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa