ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు సిగ్గుతో తల దించుకోవాల్సిందిపోయి ఏ తప్పూ చేయలేదంటూ దబాయించడం చంద్రబాబు నాయుడు, ఆయన గ్యాంగ్కే చెల్లిందని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సజ్జల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల చరిత్రలో కుంభకోణాలు తప్ప ఏమున్నాయని ప్రశ్నించారు.