ప్రజల్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ.. అనేక అక్రమాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని, 40 ఏళ్లుగా సీనియర్ పొలిటిషియన్ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత కాలానికి దొంగగా దొరికాడని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు ఒక స్కిల్డ్ క్రిమినల్.. స్కాంల విషయంలో ఆయన పేరు బయటకు వచ్చినప్పుడల్లా.. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని తప్పించుకుతిరుగుతున్న స్కిల్డ్ క్రిమినల్ అని చాలాసార్లు చెప్పామన్నారు. ఏరోజు బోను ఎక్కలేదు.. నన్ను ఎవ్వరూ తప్పు పట్టలేదని గొప్పులు చెప్పే వ్యక్తి.. ఎన్నో నేరాలు, ఘోరాలు చేసి ఇంతకాలం తప్పించుకు తిరిగాడని. కానీ, ఈరోజు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన సందర్భం వచ్చిందన్నారు. అవినీతిలో చంద్రబాబు అభినవ వీరప్పన్.. వీరప్పన్ అడవుల్లో ఉన్నాడు కాబట్టి దొంగ కాకుండా పోడు. ఈయన దొంగ పనులు, అనేక ఘోరాలు చేసి పెద్ద మనిషిగా చెలామణి అవుతూ.. రాజకీయ పార్టీని నడుపుతూ ఇవాళ కటకటాల పాలైయ్యాడన్నారు.