రాష్ట్ర ప్రజానీకం సంక్షేమమే సీఎం వైయస్ జగన్ ధ్యేయమని, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా, పూండీ-గోవిందపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి మాట్లాడుతూ.... కులం,మతం, వర్గం, ప్రాంతం వంటి వాటికి అతీతంగా ప్రజా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల అవుతున్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తులు లేకుండా,దళారీ వ్యవస్థకు దూరంగా గ్రామాల్లో సామాజిక పింఛన్లు పొందటంతో, అర్హులైన వారు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఒకప్పుడు సామాజిక పింఛన్ ఒక పార్టీ వర్గానికి చెందినవారికే అధికంగా దక్కేవన్నారు.జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టిన అనంతరం, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు వెల్లువలా చేరుతున్నాయన్నారు.