వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు. 72 శాతం పోలవరాన్ని పూర్తి చేసిన చంద్రబాబు గురించి ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు ఉంటాయో తెలియని అంబటి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా అంబటి న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మీద కేసులు మీద కేసులు వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డే వెంట్రుక పీకలేకపోయాడు..జగనెంత అంటూ వ్యాఖ్యలు చేశారు.