సోమవారం ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్సీలు రామారావు, చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, టీడీపీ నేత కోరాడ రాజబాబు.. గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, గవర్నర్కు వివరించామన్నారు. ఇంత ప్రముఖ వ్యక్తిని తనకు కూడా తెలియకుండా అరెస్ట్ చేశారని ఆశ్చర్యవ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు చంద్రబాబు మీద, అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల క్రితం కేస్ ఫైల్ చేశారని.. ఇప్పుడు ఎందుకు పేరు వచ్చిందని నిలదీశారు. టీడీపీ ఒంటరిగా గెలుస్తుందని సర్వేలు చెప్పాయని.. జనసేనతో కలిస్తే అడ్రస్ గల్లంతవుతుందని తెలిసిందని.. అందుకే ఇలా తెగబడుతున్నారని మండిపడ్డారు.