కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బైక్ ట్యాక్సీల సేవలను నిషేధించాలని కోరారు. సోమవారం బంద్ చేపట్టడంతో లక్షలాది ప్రైవేట్ వాహనాల సేవలు నిలిచిపోయాయి.