ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు పలు దేశాల అధినేతలతోపాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సు సందర్భంగా భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. కుర్చీలో కూర్చున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వద్ద మోకాళ్లపై కూర్చుని ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సన్నివేశానికి సంబధించిన ఫొటో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీంతో సునాక్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.