స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌కావడంతో టీడీపీ నేత స్వీట్లు పంచారు. విజయవాడ కోర్టు దగ్గర ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ నేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత విజయవాడ కోర్టు దగ్గర స్వీట్స్ పంచి పెడుతూ కనిపించారు టీడీపీ నేత ఆకుల వెంకటేశ్వర రావు. ఈ క్రమంలో ఆయన్ని అంతా విచిత్రంగా చూశారు. అయితే ఈ చర్య టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండడంతో.. ఆయన్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఆకుల వెంకటేశ్వరరావు చాలా కాలంగా చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేస్తున్నారు. తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నానని.. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్ నారాయణ లాకున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడం లేదని.. చంద్రబాబు తనను వాడుకొని వదిలేశారన్నారు. తనకు చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ లేదు, ఏమీ లేదు అని వ్యాఖ్యానించిన అచ్చెనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారన్నారు.
చంద్రబాబు చేసిన అన్యాయాల వల్ల తాను బలయ్యానన్నారు ఆకుల వెంకటేశ్వర్లు. తాను కేసుల్లో ఇరుక్కుని నెల రోజులు జైల్లో ఉన్నానని.. ఆ తర్వాత చంద్రబాబును వెతుక్కుంటూ వెళ్లానన్నారు. ఆయన కారులో కూడా తిరిగిన రోజులు ఉన్నాయని.. కానీ ఆయన ఎదుగుతూ కేడర్‌ను కిందకు తోసేశారన్నారు. తన కుటుంబం వీధిలో ఉందని.. చంద్రబాబును నమ్మి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాను అన్నారు. తనకు న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడంలేదని.. తనను వాడుకొని వదిలేశారన్నారు.
తనకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 400 గజాల స్థలం ఉందని.. కేఎల్ నారాయణ డబ్బులిచ్చాడని తనకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని.. ఆయన ఎదుగుతూ కేడర్‌ను తొక్కేశారన్నారు. లోకేష్ ఎర్ర బుక్‌లో తన పేరు కూడా ఉంటుందని.. చంద్రబాబు స్టేల మీద బతికే వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నారని.. లోకేష్ తనను రెడ్ బుక్‌లో ఎక్కించారని.. తనకు లోకేష్ నుంచి ప్రాణ హాని ఉందన్నారు. టీడీపీకి జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు కేవలం ఏపీకి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారని ప్రశ్నించారు వెంకటేశ్వర్లు. తెలంగాణలో పార్టీని ఎందుకు పట్టించుకోవడంలేదని.. పార్టీ కార్యకర్తలు ఈ విషయాలను గమనించాలని.. చంద్రబాబును నమ్మితే మోసపోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలని హితవు పలికారు వెంకటేశ్వర్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa