చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది. హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగుతున్నాయి. హౌస్ రిమాండ్‌కి ఇవ్వాలన్న పిటిషన్‌పై సీఐడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అటు భద్రతా కారణాలతో హౌస్ రిమాండ్‌కి ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు అంటున్నారు. హౌస్ రిమాండ్‌పై తీర్పు వ్యతిరేకంగా వస్తే బెయిల్ పిటిషన్ వేసే ఆలోచనలో బాబు లాయర్లు ఉన్నారు. అయితే చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. బాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు వెలువడనుంది.