టీడీపీ అధినేత చంద్రబాబును అవినీతి జరిగిందని సృష్టించి కస్టడీలోకి తీసుకున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ‘‘జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు’’ అని వ్యాఖ్యానించారు.