కాంగ్రెస్ దుష్టపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. క్షేత్ర పరిస్థితులకు తగ్గట్లు పొత్తులుంటాయన్నారు. అందులో భాగంగానే జేడీఎస్‌తో పొత్తు కుదిరిందన్నారు. ఈ విషయమై జేడీఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దీనిపై ఇక ఉమ్మడిగా పోరాటం చేస్తామన్నారు.