బాలయ్యా నోరు అదుపులో పెట్టుకో అని వైయస్ఆర్సీపీ హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. మీ బావ చంద్రబాబు జైలు కెళ్లాడన్న అక్కసుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. ‘స్కిల్’ స్కాంలో అధికారులు అన్ని రకాలుగా విచారించిన తర్వాతనే అవినీతి జరిగిందని తేల్చి అందుకు కారకుడైన మీ బావ చంద్రబాబును అరెస్టు చేశారు. ఇప్పటికై నా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. కాదు..కూడదు ఇలాగే మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోబోం.. జాగ్రత్త అని ఎమ్మెల్యే బాలకృష్ణనును దీపిక హెచ్చరించారు.