గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం-1 భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. అలాగే వేల్పనూరు గ్రామంలో నూతనంగా రూ. 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నూతనంగా మంజూరైన 6 కొత్త పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు అని చెప్పవచ్చు అని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వా తాతలకు, అర్హులైన ఇతరులకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న నిజమైన నాయకుడు అన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి , వెలుగోడు మండలం ఎంపీపీ లాలం రమేష్, పార్టీ మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, మండల జెసిఎస్ కన్వీనర్ తిరూపం రెడ్డి, నాయకులు అంకిరెడ్డి, ఎంపీటీసీ జనాభా రెడ్డి, ఎంపీటీసీ వెంకట రామిరెడ్డి పోతం అంకి రెడ్డి సి. ఆంకి రెడ్డి, హరినాథ్ రెడ్డి, వేల్పనూరు సర్పంచ్ సర్దార్ మియా, తదితరులు పాల్గొన్నారు.