ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల ప్రజల్లో వెలకట్టలేని సంతోషాన్ని నింపుతున్నాయని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు.కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని గుర్తు చేశారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రజలకు మంచి చేయడమే ద్వేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు.