సెల్ఫ్ సర్టిఫైడ్ సైకో బాలకృష్ణ.. అలాంటి వ్యక్తి టీడీపీ ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇన్నిరోజులూ ఆ కుర్చీలో ఒక వెన్నుపోటుదారుడు కూర్చొంటే.. ఇప్పుడు ఒక మెంటల్గాడు కూర్చొన్నాడు అని అనుకుంటున్నారు. అది నేను చెప్పే మాట కాదు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తనకు తాను మానసిక వికలాంగుడ్ని అని చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ నాలుగు మెంటల్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నానని... సెల్ఫ్ సర్టిఫైడ్ సైకోగా అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నాడు అని తెలియజేసారు.