నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. చంద్రబాబు అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి తన కార్యాలయంలో నిరాహారదీక్ష చేపట్టారు .కోటంరెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ఎలా వస్తారని కోటంరెడ్డి ప్రశ్నించారు. పోలీసులకి ఆయనకి జరిగిన వాగ్వాదం అనంతరం పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.