ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో విశాఖపట్నం మధురువాడ డిపో బస్సు మంగళవారం భద్రాచలం వెళుతుండగా తెల్లవారుజామున 5గంటలకు డొంకరాయి ఒడియా క్యాంపు మలుపు తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా కొట్టి రోడ్డుపక్కకు పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ తీసుకుని బయటకు వచ్చారు. ఈ బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరందరినీ ఏపీ జెన్కో ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో టర్నింగ్లో బస్సు జారిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ తెలిపారు.