అనంతపురం జిల్లా, రాయదుర్గం పరిధిలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆంధ్రప్రదేశ స్కిల్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగాజాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ రఘురామమూర్తి పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో 15 కంపెనీలు ప్రతినిధులు జాబ్‌మేళాను నిర్వహించారు. దాదాపు 450 మంది నిరుద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారన్నారు. ఒక్కో విద్యార్థి 3 లేదా 4 కంపెనీలకు ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన తెలిపారు. వారి ప్రతిభ, విద్యార్హతలను బట్టి 250 మందికిపైగా వివిధ కంపెనీల నుండి ఆఫర్ లెటర్స్ పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, అనంతపురం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆఫీసర్ ఎల్ ఆనంద్‌రాజ్‌కుమార్ మరియు కేటీఎస్ కళాశాల నైపుణ్య అభివృద్ధి సంస్థ కో ఆర్డినేటర్ ్స బీ వనిత, ఎం రాము, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.