స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం కారంచేడు మండలం కుంకలమర్రు జిల్లా పరిషత్ హై స్కూల్లో అండర్ 14, 17 బాల బాలికలకు కోకో, కబాడీ, వాలీబాల్, షటిల్ టోర్నమెంట్స్ జరిగాయి. కారంచేడు ఎంఈఓ-2 మొలబంటి వెంకటేశ్వర్లు లాంఛనంగా ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులకు చదువు ఎంత అవసరమో అంతకంటే క్రీడలు కూడా ముఖ్యమని ఆయన ఉద్భోదించారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని వెంకటేశ్వర్లు చెప్పారు.