తిరుపతి పరిధిలోని బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయుడు చేమూరు రవి ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తల్లిండ్రులు ఈ నెల 4వ తేది పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవో శేఖర్ ఆదేశాలతో ఎంఈవోలు రవీంద్రనాథ్, మునిసుబ్రమణ్యం ఉపాధ్యాయుడు రవి పని తీరుపై విచారణ జరిపి నివేదిక సమర్పించారు.ఈ నేపథ్యంలో రవిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఉత్తర్వులు వెలువరించారు.బాలికల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీచర్ రవి ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం దాటి వెళ్లరాదని ఆదేశించారు.