శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో ఎముకల చికిత్సకు అవసరమైన నాలుగు అధునాతన సి-ఆర్మ్ పరికరాలను ఎముకల విభాగం ఇన్‌చార్జి ప్రొఫెసర్ డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎముకలు విరిగిన చోట ఆపరేషన్ నిర్వహించడానికి, గాయాన్ని ఓపెన్ చేయకుండానే, చిన్నపాటి కోత ద్వారా శస్త్రచికిత్సను నిర్వహించడానికి, అధిక రక్తస్రావాన్ని నివారించడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే గాయాలు కూడా త్వరగా నయమవు తాయని, శస్త్రచికిత్స తరువాత రోగులు వేగంగా కోలుకుని నడవ గలుగుతారని చెప్పారు. శస్త్ర చికిత్స తరువాత వచ్చే ఇబ్బందులను చాలావరకు అరికట్టవచ్చునన్నారు. ఒక్కో పరికరం ఖరీదు రూ.18లక్షలు అని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.