విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణ శివారుల్లో అక్రమ రవాణా చేస్తున్న 43 కేసుల్లో పోలీసు సిబ్బంది పట్టుకున్న, 2, 300 లీటర్ల సారాతోపాటు 100 వివిధ రకాల మద్యం సీసా లు ధ్వంసం చేసినట్లు డీఎస్పీ మురళీధర్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..... ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా సారా అక్రమ రవాణాతో పాటు మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్ చెబుతామన్నారు. డీఎస్పీతోపాటు పట్టణ సీఐ కృష్ణారా వు, సిబ్బంది ఉన్నారు.