టీడీపీ అధినేత చంద్రబాబు కేసు గురించి ఎన్టీఆర్ జిల్లా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. జగన్ పై కేసు పెడితే సక్రమం...చంద్రబాబుపై పెడితే అక్రమమా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లారని, ఆయన జైలు పక్షి అని టీడీపీ వాళ్ళు ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుడికి వెళ్ళారా? చంద్రబాబు కూడా జైలుకే వెళ్లారు... చంద్రబాబు జైలుపక్షి కాదా అని నిలదీశారు. దేశంలో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, లాలూప్రసాద్ యాదవ్ లాంటి వారిపై కూడా దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయన్నారు. ఏ కేసునైనా న్యాయపరంగా ఎదుర్కోవాలి కానీ దురుద్దేశంతో కేసు పెట్టారని అనడం సబబు కాదన్నారు.