200 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్ షిప్ సముద్రంలో చిక్కుకుపోయినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఇండిపెండెంట్ నివేదిక వెల్లడించింది. ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా, గ్రీన్ ల్యాండ్ రాజధాని నుక్ కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం సంద్రంలో చిక్కుకుపోయినట్లు పేర్కొంది. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, వారిని రెస్క్యూ చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది.