జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మరో సైనికుడు గాయాలతో మరణించాడు. దీంతో బుధవారం ఎన్కౌంటర్ ప్రారంభమైనప్పటి నుండి మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. అనంత్‌నాగ్‌లోని కోకెర్నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటికే కల్నల్, మేజర్, జమ్మూ కాశ్మీర్ పోలీసు డీఎస్పీ చనిపోయారు.