నిపా వైరస్ వల్ల ఇద్దరు చనిపోవడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 16 (శనివారం) వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. నిపా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర బృందం ఇప్పటికే కోజికోడ్ చేరుకుంది.