కొమరోలు మండలం రెడ్డిచెర్ల, సురవారిపల్లి గ్రామాలలో శుక్రవారం వైయస్సార్ పెన్షన్ కానుకను ఎంపీపీ కామూరి అమూల్య పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు 2, 750 రూపాయలు ఒక్కొక్కరికి వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా పంపిణీ చేశారు. సీఎం జగనన్న సారథ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎంపీపీ అమూల్య అన్నారు. జగనన్న చెప్పిన విధంగా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లకు అందజేస్తున్నామని తెలిపారు.