మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న తన భార్యను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.