నేడు అనంతపురం జిల్లా, రాప్తాడులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మనసంతా చంద్రబాబు పైనే ఉంది. చంద్రన్న ఎప్పుడు బయటికి వస్తాడని అందరూ ప్రార్థన చేస్తున్నాం. మూడు రోజులు పాటు రోడ్ల వెంట తిప్పుతూ చంద్రబాబును తీవ్ర ఇబ్బందుల పాలు చేశారు. ఎన్నో కుటుంబాలను చంద్రబాబు కాపాడారు.. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును ఫొటోలు తీయడం వెనక ఏదో కుట్ర జరుగుతుంది.. చంద్రబాబును ఏమైనా చేస్తారోనని భయం వేస్తోంది. రాజమండ్రి జైల్లో కూడా చంద్రబాబుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు భయటకు వస్తారు. టీడీపీ జనసేన ఒక్కటైతే జగన్‌రెడ్డికి ఒక్క సీటు కూడా రాదు అని జోస్యం చెప్పారు.