కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... రాష్ట్రంలో జగన్ పాలనలో జరుగుతున్న ఘోరాలను వివరించానని, చంద్రబాబును కక్ష పూరితంగా ఏ విధంగా జైల్లో పెట్టారో చెప్పడం జరిగిందన్నారు. తనకు తెలిసిన వివరాలు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించానన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇంటర్నల్ సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందని చెప్పానన్నారు. అయితే చంద్రబాబు అంశం ఇప్పటికే కేంద్రం దృష్టికి వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారన్నారు.