బ్రిటన్ సర్కార్ భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే స్టడీ వీసా ఫీజును దాదాపు 127 పౌండ్ల వరకు పెంచేసింది. అక్టోబర్ 4 నుంచి పెంచిన ఫీజులు అమల్లోకి రానున్నాయి. దీనిపై బ్రిటీష్ పార్లమెంటులో ఇటీవల చట్టం చేశారు. స్టూడెంట్ వీసా దరఖాస్తు ఫీజును సైతం 490 పౌండ్ల వరకు వసూలు చేయనున్నట్లు యూకే హోం ఆఫీస్ వెల్లడించింది. కీలక సేవల్ని అందించే ఉద్దేశంతో ఫీజు పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.