జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనుమానిత ప్రాంతానికి భద్రతా బలగాలు వెళ్లగా మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు దాడికి దిగాయి. ప్రస్తుతం ఉగ్ర వేట కొనసాగుతోంది.