కోల్ ఇండియా లిమిటెడ్ లో 560 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు గరిష్టంగా 30 ఏళ్లుండాలి. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 12. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. పూర్తి వివరాలకు https://www.coalindia.in/ చూడాలని అధికారులు సూచించారు.