ఈ నెల 21 నుంచి 27వ తేదీ దాకా సాగే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. అన్ని అంశాలపై సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, తాము లేవనెత్తే అంశాలను ఈ నెల 21న జరిగే బీఏసీ సమావేశంలో ప్రతిపాదిస్తామని బుగ్గన తెలిపారు. శాసనసభలో లేవనెత్తాల్సిన ప్రశ్నలను పాలక, ప్రతిపక్ష సభ్యులు శాసనసభ, శాసనమండలి కార్యదర్శులకు అందజేశారు. ఎమ్మెల్యేల జీతభత్యాలను ఈ సమావేశాల్లోనే పెంచాలన్న ప్రతిపాదనను చేయనున్నట్లు సమాచారం. అసైన్డ్ భూములకు సంబంధించిన బిల్లు, ఏడు ఆర్డినెన్సులను సభలో ప్రవేశ పెడుతున్నామని పాలకపక్షం వెల్లడించింది.