టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనేవి చాల బాధాకరమైన విషయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్లు లేదన్నారు. నిజాలను వెలికి తీయడానికి రిమాండ్ ఎందుకు విధించారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, 73 ఏళ్ల వ్యక్తి విదేశాలకు పారిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా కోర్టుకు హాజరై సహరించే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. జగన్ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు.