ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆదివారం నూతన పార్లమెంటు భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం చేపట్టారు. లోక్సభ స్పీకరు ఓం బిర్లా కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, ఉభయ సభల్లోని పలు పార్టీల నేతలు హాజరవుతారు.