చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం మార్టూరులో జరిగిన ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కలిసి కందుకూరు టిడిపి ఇన్చార్జ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మార్టూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని నేతలందరూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.