దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 351 పాయింట్ల నష్టంతో 67,244 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 99 పాయింట్లు కుంగి 20,033 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.20 దగ్గర ప్రారంభమైంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. HDFC, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.