స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును, జగన్ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా ఇరికించిందని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. అందుచేత సీఐడీ నమోదు చేసిన కేసు.. విజయవాడ ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ చెల్లవని తెలియజేసారు. జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.