అంతర్జాతీయ యుద్ధ నేరాలు, ఇతర నేరాలను విచారించే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)కి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ICC కంప్యూటర్ వ్యవస్థను హ్యాకింగ్ చేశారు. దీనిపై ICC తాజాగా స్పందించింది. నాలుగు రోజుల క్రితమే అసాధారణ కార్యకలాపాలను గుర్తించినట్లు తాజాగా వెల్లడించింది. సైబర్ దాడులను నిరోధించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే సమస్య తీవ్రత, పరిష్కారంపై స్పష్టత ఇవ్వలేదు.