సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ కార్పొరేషన్ పదవులలో మరియు పార్టీ పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం నేడు దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పేర్కొన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో జడ్పీచైర్మన్ హర్షం వ్యక్తం చేశారు.