లోక్‌సభలో బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కానుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. బిల్లుకు ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. దీంతో లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. నారీశక్తి వందన్‌గా నామకరణం చేసిన ఈ బిల్లు అమల్లోకి వస్తే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.